Spiritual: ఆదాయానికి మించి ఖర్చులా? ఇలా చేసి చూడండి
Spiritual: డబ్బులు పోగొట్టుకున్నవారు, ఉద్యోగం కోల్పోయినవారు, సంపాదిస్తున్న దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నవారు ఈ శ్రావణ మాసంలోని నాలుగు శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. కేవలం శుక్రవారం అనే కాదు.. ప్రతి రోజూ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ ఇంట్లో దరిద్రం దరిదాపుల్లోకి కూడా రాదు. ఇంట్లో ఆర్థిక సమస్యలు పీడిస్తుంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఇంకా మంచిది.
సాధారణంగా వరలక్ష్మి వ్రతం అంటే ఆడవారు మాత్రమే చేసుకునే పూజ అనుకుంటారు. సాయంత్రం వేళల్లో తాంబూలాలు వాటికి మగవారి అవసరం లేదు కానీ.. వ్రతం సమయంలో తప్పకుండా భర్త భార్య పక్కన కూర్చుని పూజలో పాల్గొనాల్సిందే. వరలక్ష్మి వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామునైనా చేసుకోవచ్చు.. లేదా సాయంత్రం వేళలో అయినా చేసుకోవచ్చు. వ్రతం చేసుకుంటున్న రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి.. మాంసాహారం జోలికి వెళ్లకూడదు.