Vinesh Phogat: ఫోగాట్‌కు లక్కీ చాన్స్..!
Vinesh Phogat: ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు వెళ్లలేక అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇక తాను పోరాడలేనని రెజ్లింగ్‌కు స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో ఆమెను ఫైనల్స్‌కి వెళ్లనివ్వలేదు. ఫోగాట్ రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యిందే కానీ తన పట్ల జరిగింది అన్యాయమే అని ఆమె భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫోగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో (CAS) అప్పీల్‌ను దాఖలు చేసింది. ఫోగాట్ తరఫున నలుగురు లాయర్లు వాదించనున్నారు. ఇది ఆమెకు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ నలుగురు లాయర్లు ఫోగాట్‌కు జాయింట్ సిల్వర్ మెడల్ ఇప్పించాలని తీవ్రంగా కృషిచేస్తున్నారు.