Divorce: ఇది విడాకుల ఫొటోషూట్..!
America: పెళ్లిళ్లకు ముందు చేసుకునే ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ల(photo shoot) గురించి వినే ఉంటారు. కానీ విడాకుల(divorce) ఫొటో షూట్ గురించి విన్నారా? పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ ఈ ఫొటోషూట్‌ను(divorce photoshoot) సోషల్ మీడియాలో షేర్ చేసింది. విడాకులు(divorce) అనేది ఎవరికైనా కష్టమైన విషయమే. జీవితాంతం భాగస్వామితో కలిసి ఉంటామన్న ఆశతోనే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లిలో కలహాలు వస్తే విడాకులే గతి. జీవితంలో ఎన్ని బాధలు పడిందో ఏమో.. అమెరికాకు చెందిన బ్రూక్ అనే మహిళ విడాకులు వచ్చేసరికి ఇలా ఫొటోషూట్‌తో సెలబ్రేట్ చేసుకుంది.
బ్రూక్ వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యల గురించి వివరించలేదు కానీ ఆమె ఎంతో బాధను అనుభవించినట్లు తెలుస్తోంది. విడాకులకు అప్లై చేసిన తర్వాత ఎన్నోసార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందట. దాదాపు సంవత్సరం తర్వాత తనకు విడాకులు మంజూరు చేయడంతో ఫ్రీడం దొరికిందని సంతోషపడుతోంది. ఈ సంతోషాన్ని పెళ్లిలాగే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ సమక్షంలో ఫొటోషూట్ చేయించుకుంది. పెళ్లి సమయంలో వేసుకున్న గౌనును చించేస్తూ.. పరదాకు నిప్పు పెడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.