Naga Chaitanya: శోభిత‌తో నిశ్చితార్థం.. ఆ రెండు సమంత ఫోటోలు డిలీట్ చేయ‌ని చై

naga chaitanya did not delete 2 samantha pics from instagram

Naga Chaitanya: అక్కినేని నాగ‌చైత‌న్య‌.. న‌టి శోభిత ధూలిపాల‌ను ఈరోజు నిశ్చితార్థం చేసుకున్నారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో ఈ నిశ్చితార్ధ వేడుక కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా జ‌రిగింది. నిశ్చితార్థ‌ ఫోటోల‌ను అక్కినేని నాగార్జున షేర్ చేస్తూ కాబోయే దంప‌తుల‌ను విష్ చేసారు. అయితే… శోభిత‌తో నిశ్చితార్థం అయ్యాక కూడా నాగ‌చైత‌న్య త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మాజీ భార్య స‌మంత ఫోటోల‌ను అలాగే పెట్టుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. స‌మంత‌కు సంబంధించిన రెండు ఫోటోలు చై ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్ప‌టికీ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మిగ‌తా ఫోటోల‌న్నీ డిలీట్ చేసి ఈ రెండింటిని మాత్ర‌మే ఎందుకు పెట్టుకున్నారు అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.