YS Sharmila: నందమూరి అలేఖ్య పుట్టినరోజు వేడుకలో షర్మిళ
YS Sharmila: దివంగత నటుడు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య పుట్టినరోజు సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ ఆమెను సర్‌ప్రైజ్ చేసారు. నిన్న రాత్రి షర్మిళ అలేఖ్య నివాసానికి వెళ్లారు. షర్మిళతో పాటు తన కూతురు అంజలి కూడా ఉన్నారు. తన చేత కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు.
“” గత కొన్ని సంవత్సరాలుగా నాకు తోడుగా ఉంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నావ్ అక్కా. నా పుట్టినరోజును గుర్తుపెట్టుకుని నాకోసం సమయం కేటాయించినందుకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. నీలాగా ఎవ్వరూ ఉండరు. నా జీవితంలో నీ స్థానం వేరొకరితో భర్తీ చేయలేనిది. కొన్ని సార్లు సరైన కారణాల వల్లే మనకు కన్నీళ్లు వస్తాయి. రక్తసంబంధం ఉంటేనే కుటుంబం కాదు. మీతో ఉంటూ మీ సంతోషాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ మనకు కుటుంబ సభ్యులే “” అని అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు.