కూతురికి బలవంతంగా పోర్న్ చూపిస్తూ.. ఏడాదిగా అత్యాచారం
Viral News: ఉత్తర్ప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. అమ్రోహా ప్రాంతానికి చెందిన ఓ రైతు కన్న కూతురికి బలవంతంగా పోర్న్ చూపిస్తూ ఏడాదిగా తనపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం ఆ వ్యక్తి తన భార్యను రోజూ తాగి వచ్చి కొడుతుండడంతో ఆమె తట్టుకోలేక పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయింది. పుట్టింట్లో బంధువుల ఇంట్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా వదిలేసాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూతురిపై కన్నేసాడు. రోజూ తాగి వచ్చి 12 ఏళ్ల కూతురికి పోర్న్ చూపిస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. సమయం చూసుకుని ఆ బాలిక తన అత్తకు మ్యాటర్ చెప్పడంతో ఆమె షాకైంది. వెంటనే బాలికను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.