Kavitha: లిక్కర్ స్కాంలో షాకింగ్ ట్విస్ట్.. చాట్స్ బయటపెట్టిన సుఖేష్
Delhi: దిల్లీ లిక్కర్ స్కాంలో(liquor scam) షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. 200 కోట్ల స్కాంలో దిల్లీలో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌కు(sukesh chadrasekhar) ఈ లిక్కర్ స్కాంలో హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సుఖేష్ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ ఎస్(BRS) ఎమ్మెల్సీ కవితతో(kavitha), దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) సహచరులతో చాట్స్ చేసినట్లు సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ చాట్స్‌లో ప్రధాన సూత్రధారుల పేర్లను వేరే పేర్లతో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని చాట్ చేసినట్లు సుఖేష్ వెల్లడించాడు. కవిత పేరును అక్క అని సేవ్ చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని కవిత ప్రధాన కార్యాలయాన్ని జేఐఐ అని సేవ్ చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై ఈడీ మరోసారి కవితను విచారించనున్నట్లు సమాచారం.