Shardul Thakur: ఆస్ట్రేలియా దారుణ ప్రవర్తన.. శార్దూల్ షాకింగ్ వెల్లడి
Shardul Thakur: 2020- 2021 సమయంలో ఆస్ట్రేలియాలో జరిగిన గబ్బా టెస్ట్ సిరీస్ సమయంలో ఆ దేశం తమ పట్ల ఎంత దురుసుగా ప్రవర్తించిందో షాకింగ్ విషయాలను వెల్లడించాడు శార్దూల్ ఠాకూర్. గబ్బా టెస్ట్ సిరీస్ సమయంలో చాలా మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మొత్తానికి ఆ టెస్ట్‌లో గెలిచింది టీమిండియానే.
అయితే గబ్బా టెస్ట్ సమయంలో టీమిండియా ఆటగాళ్లకు కేటాయించిన హోటల్ రూంలో కనీసం హౌస్ కీపింగ్ కూడా ఇవ్వలేదని.. క్రికెటర్లే గదులను శుభ్రం చేసుకోవాల్సి వచ్చిందని శార్దూల్ తెలిపారు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ టీమిండియా క్రికెటర్లపై జాతి వివక్ష కామెంట్స్ చేసారని మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్‌లను బాగా టార్గెట్ చేసారని పేర్కొన్నారు. క్వీన్స్‌ల్యాండ్ లేడీ గవర్నర్ టీమిండియాపై కించపరిచే వ్యాఖ్యలు చేసారని.. టీమిండియా ఆటగాళ్లు రాకపోతే పోనివ్వండి.. వారి కోసం మేం మ్యాచ్‌లు ఏర్పాటుచేయలేం అని వ్యాఖ్యానించారని అన్నారు.
ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా గబ్బా టెస్ట్‌లో చివరికి టీమిండియానే గెలిచిందని అన్నారు. అయితే శార్దూల్ ఠాకూర్ ఇప్పుడు వెల్లడించినవి సాధారణ విషయాలు కావు. ఇలాంటి వాటిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఐసీసీ, బీసీసీఐకి అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే కచ్చితంగా అప్పుడే ఏదో ఒక యాక్షన్ తీసుకునేవారు. అది మానేసి అంతా అయిపోయాక 2024లో శార్దూల్ ఈ విషయాలను IISM కార్యక్రమంలో వెల్లడించడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.