Naveen Polishetty: ర‌హస్యంగా న‌వీన్ వివాహం..?

did naveen polishetty married secretly

Naveen Polishetty: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌, జాతిర‌త్నాలు సినిమాల‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న న‌వీన్ పోలిశెట్టి.. ఆ త‌ర్వాత మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాతో ముచ్చ‌ట‌గా మూడో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు. మూడో సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు న‌వీన్ నుంచి ఎలాంటి కొత్త సినిమా అప్డేట్ లేదు. పైగా ఆయ‌న చేతికి గాయం కావ‌డంతో రెస్ట్ తీసుకుంటున్నారు.

అయితే.. న‌వీన్ గురించి ఒక షాకింగ్ రూమ‌ర్ వైర‌ల్ అవుతోంది. న‌వీన్ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నార‌ట‌. ఓ అమెరికా అమ్మాయిని ఆయ‌న ప్రేమించి పెళ్లి చేసుకున్నార‌ని.. మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా త‌ర్వాత ఆయ‌న కొన్ని నెల‌ల పాటు అమెరికాలో ఉండి వ‌చ్చార‌న్న టాక్ వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఈ పెళ్లి విష‌యాన్ని ఆయ‌న బ‌య‌టికి చెప్ప‌డం లేద‌ని టాక్. ఏదేమైనా దీనిపై న‌వీన్ స్పందిస్తే ఇస్తే త‌ప్ప అది నిజ‌మా రూమ‌రా అనే క్లారిటీ మ‌న‌కు రాదు.