సింగిల్‌గా వచ్చే సింహానికి భయమా?
Jagan Mohan Reddy: పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గురించి ఎన్నికల ప్రచారంలో తెగ హైప్ ఇచ్చారు. తమ అధినేత పులివెందుల పులి.. ఎవ్వరికీ బెదరని సింహం అంటూ డైలాగులు కొట్టారు. వాళ్లేదో అభిమానంతో అంటే అన్నారు. కానీ అలాంటి డైలాగులు కొట్టి నా పరువు తీయకండి అని జగన్ ఒక్కసారి కూడా వారికి చెప్పి ఉండరు.
అంటే ఈ ఎలివేషన్ డైలాగులను జగన్ కూడా ఎంజాయ్ చేస్తున్నట్లే. అలాంటి పులివెందుల పలి.. బెదరిని సింహానికి ఓడిపోగానే ఉన్నట్టుండి భయం పట్టుకుందట. ఢిల్లీని ఎదురించిన ధీరుడికి… సింగిల్‌గా వచ్చే సింహానికి… స్వయం ప్రకటిత పులివెందుల పులికి భద్రత కావాలట. నాడు పరదాలు లేకుండా అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్న జగన్.. నేడు భద్రత కోసం కోర్టును కోరే పరిస్థితిని తెచ్చుకున్నారు. అయినా రాష్ట్రంలోనే ఉండని వ్యక్తిపై భద్రత పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించడం సబబేనా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో అసలు ఉండటంలేదు. ఎక్కువగా బెంగళూరులో ఉన్న నివాసంలోనే ఉండేందుకు యత్నిస్తున్నారు. అలాంటప్పుడు అంత భారీ భద్రత ఎందుకో..!