RGV: తెలుగు హీరో డబ్బులిచ్చి థియేటర్లలో తన సినిమాను ఆడించాడు
RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆ హీరో తన సినిమాలను హిందీలో రిలీజ్ చేయించుకుని అక్కడ ఆడకపోతే థియేటర్ ఓనర్లకు డబ్బులిచ్చి మరీ బలవంతంగా ఆడించాడట. ముంబైకి చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ మన హీరోతో ఓ సినిమా తీయించిందట. అది కాస్తా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కడ తన పరువు పోతుందో అని హీరోనే థియేటర్లకు డబ్బులిచ్చి ఆడించాడట.
వర్మ ఈ కామెంట్స్ చేయగానే ఆ హీరో ఎవరై ఉంటారబ్బా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. చాలా మంది నెటిజన్లు ప్రభాస్ అయ్యుంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత నుంచి తన ప్రతి సినిమాను హిందీలోనూ విడుదల చేయిస్తున్న ఏకైక హీరో ప్రభాసే అని ఆయనే అయ్యుంటారంటూ విమర్శలు చేస్తున్నారు.