Nithin​ సినిమా..పవర్​ఫుల్​ రోల్​లో పవర్​స్టార్​!

Hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)​కి ప్రేక్షకుల్లోనే కాదు టాలీవుడ్ సెలబ్రిటీస్​లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వారిలో ఒకరు యంగ్ హీరో నితిన్(Nithin). చాలా సందర్భాల్లో నితిన్​ తనకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అంటే ఎంత అభిమానమో చెప్పకనే చెప్పారు. తన ప్రతీ సినిమాలో ఎదో ఒక సందర్భం లో నితిన్ పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొస్తారు. ఇప్పుడు ఏకంగా తను చేస్తున్న సినిమాలో కూడా పూర్తిగా పవన్ కల్యాణ్ రిఫరెన్స్ తో నిండిపోయి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో పవన్​ కనిపించనున్నారని సమాచారం​.

టాలీవుడ్​లో మల్టీస్టారర్​ సినిమాలకి మంచి క్రేజ్​ ఉంది. తాజాగా మరో మల్టీస్టారర్​ రాబోతోందని తెలుస్తోంది. నితిన్​ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు.ఈ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నారు. కన్నడ భామ శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్​ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఈ సినిమాలో నితిన్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.
ఎన్నో సందర్భాలలో నితిన్ పవన్ కల్యాణ్ సినిమాలో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ రోల్ వచ్చినా చేస్తాను అని చెప్పారు. కానీ వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఇప్పుడు వక్కంతం వంశీతో నితిన్(Nithin) చేస్తున్న సినిమాలో పవన్ కల్యాణ్​(Pawan Kalyan) రెండు నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్ర పోషించబోతున్నాడని తెలుస్తుంది. ఆ సన్నివేశాన్ని త్వరలోనే చిత్రీకరించబోతున్నారని టాక్​.