బాల‌య్య “ఆవేశం”

nandamuri balakrishna to star in avesham remake

Balakrishna: నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఇక ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఓ సినిమాలో న‌టిస్తున్నారు. చూడ‌బోతే ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అనేలాగే ఉంది. అయితే బాల‌య్య త‌దుప‌రి సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైర‌ల్ అవుతోంది. మ‌ల‌యాళంలో బ్ర‌హ్మాండ‌మైన విజ‌యం సాధించిన ఆవేశం సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ట‌.

ఫాహ‌ద్ ఫాసిల్ న‌టించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి స‌క్సెస్ అయ్యింది. కాక‌పోతే తెలుగులో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. అలా కాకుండా ఏకంగా సినిమానే రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది? అని టాలీవుడ్ ఆలోచిస్తోంద‌ట‌. అన్నీ కుదిరితే ఆవేశంను తెలుగులో బాల‌య్య బాబుతో రీమేక్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ బాల‌య్య కంటే మ‌హేష్ బాబుతో చేస్తే బాగుంటుంద‌ని కొంద‌రు.. బాల‌య్య‌తో ఈ రీమేక్ అస్స‌లు సెట్ అవ్వ‌దు అని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు.