Israel Gaza War: తిండి పెట్ట‌కుండా చంపేద్దాం స‌ర్.. నేత‌న్యాహుకి ఆర్ధిక మంత్రి స‌ల‌హా

Israel's Finance Minister suggested starving Gaza's population might be justified until Israeli hostages are freed

Israel Gaza War:  ఇజ్రాయెల్ గాజా మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం నేప‌థ్యంలో హ‌మాస్ ఉగ్ర‌వాదుల వ‌ద్ద ఉన్న త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నేత‌న్యాహు కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇజ్రాయెల్ ఆర్ధిక మంత్రి బిజాలెల్ స్మాట్రిచ్‌.. నెత‌న్యాహుకి ఇచ్చిన స‌ల‌హా వైర‌ల్‌గా మారింది. గాజాలో ఉన్న 2 మిలియ‌న్ ప్ర‌జ‌ల‌కు తిండి పెట్ట‌కుండా చంపేస్తే.. హ‌మాస్ వారంత‌ట వారే ఇజ్రాయెల్ బందీల‌ను వ‌దిలిపెడ‌తార‌ని స‌ల‌హా ఇచ్చారు.

ఈ ప‌ని చేసేందుకు అంత‌ర్జాతీయ క‌మ్యూనిటీ ఎటూ ఒప్పుకోద‌ని.. గాజాకు సాయం చేయ‌డం ద్వారా హ‌మాస్ కేవ‌లం కొద్ది మంది ఇజ్రాయెల్ వాసుల‌నే విడిచిపెడ‌తార‌ని బిజాలెల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వారితో ముచ్చ‌ట్టు పెడ‌తూ స‌మ‌యానికి తిండి పెడుతుంటే ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగుతుంద‌ని.. తిండి పెట్ట‌కుండా క‌డుపు మాడిస్తే వారే ఇజ్రాయెల్ బందీల‌ను వ‌దిలేస్తార‌ని బిజాలెల్ నేత‌న్యాహుకు వివ‌రించారు. హ‌మాస్‌తో ఒప్పందాలు చేసుకుంటూ కూర్చుంటే వారి ముందు ఇజ్రాయెల్ ప‌రువు పోతుంద‌ని.. దాని వ‌ల్ల బ‌ల‌ప‌డేది హ‌మాసే అని అంటున్నారు.

న‌వంబ‌ర్ 2023లో ఇలాగే ఇజ్రాయెల్ హ‌మాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంద‌ని కానీ అప్పుడు ప‌రిస్థితుల్లో ఒప్పందం చేసుకోవ‌డానికి ఒప్పుకోక త‌ప్ప‌లేద‌ని.. ఇక ఇప్పుడు కూడా ఈ ఒప్పందాలు చేసుకుంటూ కూర్చుంటే ఇజ్రాయెల్‌పై ఉమ్మేస్తార‌ని బీజాలెల్ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. గ‌తేడాది అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఓ ప‌బ్లిక్ ఫెస్టివ‌ల్‌లోకి హ‌మాస్ ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి వేలాది మంది ఇజ్రాయెల్ వాసుల‌ను బందీలుగా చేసుకున్నారు. త‌మ డిమాండ్ల‌ను ప‌రిశీలించాలంటూ యుద్ధ వాతావ‌ర‌ణం సృష్టించారు. అప్ప‌టి నుంచి ఇజ్రాయెల్ హ‌మాస్ అంతు చూసేందుకు పాలెస్తీనాలోని గాజాపై మెరుపు దాడులు చేస్తూనే ఉంది. అక్టోబ‌ర్ 7 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 39,550 పాలెస్తీనా వాసులు చ‌నిపోయార‌ని వారిలో సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నార‌ని గాజా ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.