Gautam Gambhir: గంభీర్ టీమిండియా కోచ్‌గా ఎక్కువ కాలం ఉండ‌డు.. మాజీ పేస‌ర్ షాకింగ్ వ్యాఖ్య‌లు

Joginder Sharma says gautam gambhir will not be a captain for too long

Gautam Gambhir:  గౌత‌మ్ గంభీర్ టీమిండియా కోచ్‌గా ఎక్కువ కాలం ఉండ‌డ‌ని అన్నారు మాజీ పేస‌ర్ జోగింద‌ర్ శ‌ర్మ‌. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌దవీ కాలం ముగియ‌డంతో గంభీర్ నూత‌న టీమిండియా కోచ్‌గా గ‌త నెల‌లోనే బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అయితే గంభీర్ ఎంత మంచి కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ.. అతని ముక్కుసూటిత‌నం.. ఏద‌న్నా ముఖం మీదే చెప్పేసే త‌త్వం వ‌ల్ల ఎంతో కాలం ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌డ‌ని తెలిపారు. టీంలోని కొంద‌రు ప్లేయ‌ర్లు గంభీర్ నిర్ణ‌యాలు ప‌ట్ల సంతృప్తిక‌రంగా ఉండ‌ర‌ని.. తాను ఇక్క‌డ కేవ‌లం విరాట్ కోహ్లీని ఉద్దేశించి మాట్లాడ‌ట్లేద‌ని తెలిపారు. గంభీర్ ముక్కుసూటిత‌త్వం త‌న‌కు నచ్చుతుంద‌ని.. కానీ కొంద‌రిని త‌న నిర్ణ‌యాల‌తో సంతృప్తి ప‌ర‌చ‌డం వంటి ప‌నులు గంభీర్ చేయ‌డు కాబ‌ట్టి రాబోయే కాలంలో టీమిండియా కోచ్ ప‌ద‌వి కాస్త క‌ష్టంగానే ఉంటుంద‌ని తెలిపారు.