Health: సెక్స్ పెర్ఫామెన్స్‌ని పెంచే కుంకుమ‌పువ్వు.. ఎన్ని లాభాలో తెలుసా?

how saffron increases libido

 

Health: కుంకుమ‌పువ్వు గురించి విన‌గానే గ‌ర్భిణుల‌కు పాల‌ల్లో వేసి ఇస్తారు అన్న విష‌యం వ‌ర‌కే మ‌నం ఆలోచిస్తాం. కానీ ఈ కుంకుమ పువ్వు సెక్స్ పెర్ఫామెన్స్‌ని పెంచే అమోఘ‌మైన ఔష‌ధమ‌ని చాలా మంది తెలీదు. మోడ్ర‌న్ ప‌రిశోధ‌న‌ల్లో కూడా ఈ విషయం తేలింది. ఈ కుంకుమ‌పువ్వులో క్రోసిన్, సాఫ్రానాల్ అనే రెండు సుగుణాలు డిప్రెష‌న్‌ను అదుపులో ఉంచి ఒత్తిడిని దూరం చేస్తాయి. ఫ‌లితంగా సెక్సువ‌ల్ పెర్ఫామెన్స్ పెరుగుతుంది.

ఈరోజుల్లో మారుతున్న జీవ‌న శైలి ప్ర‌భావం వ‌ల్ల స‌హ‌జంగా గ‌ర్భం దాల్చ‌లేక‌పోతున్న వారు చాలా మంది ఉన్నారు. మ‌నం పీల్చే గా లి నుంచి తీసుకునే ఆహారం వ‌ర‌కు అన్నీ కల్తీనే. దీని వ‌ల్ల వీర్య‌క‌ణాల క్వాలిటీ, క్వాంటిటీ రెండూ త‌గ్గిపోతున్నాయి. ఇప్పుడున్న ఒత్తిళ్ల‌లో కొంద‌రు మ‌గ‌వారికి, ఆడ‌వారికి సెక్స్ చేయాల‌న్న కోరిక కూడా క‌ల‌గ‌డంలేదు. పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నించేవారు స‌హ‌జ ప‌ద్ధ‌తిలో కాకుండా ఐవీఎఫ్‌లు చేయించుకోవాల్సిన ప‌రిస్థితి. నాలుగు ప‌లుకుల కుంకుమ‌పువ్వును పాల‌ల్లో కానీ చాయ్‌లో కానీ వేసుకుని తీసుకుంటే ఫీల్‌గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.

ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగి కండ‌రాలు రిలాక్స్ అవుతాయి. పురుషుల్లో ఎక్కువ‌గా ఉండే ఎరెక్టైల్ డిస్‌ఫంక్ష‌న్ అనే స‌మ‌స్య కూడా దూరం అవుతుంది. శృంగార చ‌ర్య‌కు ముందు మ‌గ‌వారికైనా ఆడ‌వారికైనా మాన‌సిక ఒత్తిడి అనేది ఉండ‌కూడ‌దు. ఆ మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించే దివ్య ఔష‌ధం ఈ కుంకుమ‌పువ్వు. ముఖ్యంగా మూడ్ తెచ్చే సెరోటొనిన్ అనే హార్మోన్స్ విడుద‌లయ్యేలా చేస్తుంది.

కుంకుమ‌పువ్వును ఎలా వాడాలి?

పాల‌ల్లో నాలుగు ప‌లుకుని వేసుకుని తాగ‌చ్చు

గ్రీన్ టీ, బ్లాక్ టీలో కూడా వేసుకోవ‌చ్చు

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

కుంకుమ‌పువ్వుని ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎల‌ర్జీ ఉన్న‌వారికి ద‌ద్ద‌ర్లు వ‌స్తాయి. ఎక్కువ‌గా తాగితే క‌ళ్లు తిర‌గ‌డం, వాంతులు అవుతున్న‌ట్లు ఉండ‌టం, విరోచ‌నాలు అవ్వ‌డం వంటివి జ‌రుగుతుంటాయి. బ్ల‌డ్ థిన్న‌ర్ మందులు వేసుకునే వారు వైద్యుల‌ను సంప్ర‌దించి వాడాలి.