Lifestyle: వ‌క్షోజాలు చిన్న‌గా ఉంటే పెళ్లి కాదా?

can smaller breasts lead to marital problems

Lifestyle: నా వ‌య‌సు 28. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ నా వ‌క్షోజాలు చిన్న‌గా ఉంటాయి. నా హైట్ 5’5. బ‌రువు 60 కిలోలు. ఈ వ‌య‌సులో నాకు ఉండాల్సిన సైజులో వ‌క్షోజాలు లేవు అనిపిస్తోంది. ఇలా ఉంటే పెళ్లి కాదు అని నా ఫ్రెండ్స్ భ‌యపెడుతున్నారు. ఏద‌న్నా స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు.

నిపుణుల స‌ల‌హా

ముందు ఇలాంటి స‌ల‌హాలు, లేనిపోని అనుమానాలు క‌లిగిస్తున్న మీ ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండండి. వ‌క్షోజాల సైజుకి పెళ్లి కాక‌పోవ‌డానికి సంబంధమే లేదు. కొంద‌రికి సైజు పెద్ద‌గా ఉంటాయి మ‌రికొంద‌రికి చిన్నగా ఉంటాయి. మీకు మీ వ‌క్షోజాలు కాస్త పెద్ద‌విగా క‌నిపించాలి అనిపిస్తే మార్కెట్‌లో ర‌క‌ర‌కాల సైజుల్లో బ్రాలు అందుబాటులో ఉన్నాయి. చ‌క్క‌గా అవి వేసుకోండి. మీకు మంచి సంబంధం కుదురుతుంది. ఇలాంటి అపోహ‌లు పెట్టుకుని అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డ‌కండి.