Eluru: మా భార్యలను కాపురానికి పంపండి
Eluru: ఏలూరులో వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. తమ భార్యలు కాపురానికి రావడం లేదని వారిని తమతో పంపిస్తే తప్ప ధర్నా విరమించుకోమని అన్నారు. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న తమ మామ బికె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మోసపోయామంటూ ఇద్దరు అల్లుళ్లు ఇవాళ ఉదయం స్థానిక కలక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు.