Botsa Satyanarayana: వివేకాలాగే ఓడిపోతారా?
Botsa Satyanarayana: విశాఖపట్నంలో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణను అభ్యర్ధిగా ఎంపిక చేసింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లిపోవడం ఆ సీటు ఖాళీ అయ్యింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 6న రానుంది. ఆగస్ట్ 30న ఉప ఎన్నిక జరుగుతుంది. విశాఖలో స్థానికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 615 మంది ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఉండగా.. మిగతా 215 ఓట్లు తెలుగు దేశం పార్టీకి ఉన్నారు.
అయితే.. ఈ స్థానిక ఎన్నికల్లో బొత్సకు.. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో లేదు. ఈ ఎన్నికను తెలుగు దేశం పార్టీ కాస్త సీరియస్‌గా తీసుకుని ప్రచారం చేస్తే గెలిచే అవకాశం ఉంది. 2017లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కడప స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మంచి ఓటు బలం ఉన్నప్పటికీ అప్పట్లో అక్కడ తెలుగు దేశం పార్టీ నేత గెలిచాడు. చంద్రబాబు నాయుడు ఈ విశాఖ స్థానిక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటే బొత్స కూడా వివేకాలాగే ఓడిపోయే అవకాశం 100 శాతం ఉంది.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొత్సతో పాటు ఆయన కుటుంబం మొత్తం ఘోరంగా ఓటమి పాలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొత్స కుటుంబానికి 5 టికెట్లు ఇచ్చింది. ఈ ఐదుగురు అభ్యర్ధుల్లో ఒక్క అభ్యర్ధి కూడా గెలవలేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బొత్స ఓడిపోతే మాత్రం ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.