Prabhas: రాజ‌మౌళి ఇంటి బ‌య‌ట నిద్ర‌పోయాడు.. ఇంట్రెస్టింగ్ విష‌యం వెల్ల‌డించిన డార్లింగ్

prabhas revealed interesting topic about ss rajamouli

Prabhas: దర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి గురించి ప్ర‌భాస్ ఒక ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌మౌళికి సంబంధించిన మోడ్ర‌న్ మాస్ట‌ర్స్: ఎస్ఎస్ రాజ‌మౌళి పేరిట‌ డాక్యుమెంట‌రీని నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో టాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌ముఖులు రాజ‌మౌళి గురించి గొప్ప‌గా చెప్తూ ఆస‌క్తిక‌ర అంశాల‌ను పంచుకున్నారు. వారిలో ప్ర‌భాస్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ రాజ‌మౌళి గురించి చెప్తూ.. ఓసారి ఆయ‌న ఇంటి బ‌య‌ట ప‌డుకోవాల్సి వ‌చ్చిందని అన్నారు. ఓసారి ప‌నిలో ప‌డి రాజమౌళి ఆల‌స్యంగా ఇంటికి వెళ్లార‌ట‌. అప్ప‌టికే ఆయ‌న భార్య ర‌మ నిద్రపోయి ఉన్నారు. దాంతో ఆమెని లేపి డిస్ట్ర‌బ్ చేయ‌డం ఇష్టం లేక ఇంటి బ‌య‌టే కారులో నిద్రపోయార‌ట‌.