Elon Musk: నా వ‌ల్ల కాదు.. ట్విట‌ర్ అమ్మేస్తా

Hyderabad: ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా(tesla) సంస్థ అధినేత ఎలాన్ మ‌స్క్‌కి(elon musk) అప్పుడే ట్విట‌ర్‌(twitter)పై మోజు తీరిపోయిన‌ట్లుంది. ఇక ఈ ట్విట‌ర్‌ను చూస్కోవ‌డం నా వ‌ల్ల కాదు బాబోయ్ అని చేతులు ఎత్తేసారు. స‌రైన వ్యక్తి దొరికితే అత‌నికి అమ్మేస్తాన‌ని అంటున్నారు. 2022లో మ‌స్క్(elon musk) ట్విట‌ర్‌ను 44 బిలియ‌న్ డాల‌ర్ల‌ను కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిని న‌డ‌పడం చాలా ఇబ్బందిక‌రంగా ఉంద‌ని మ‌స్క్(elon musk) అంటున్నారు. ట్విట‌ర్‌కు(twitter) ప్ర‌భుత్వం నుంచి ఫండ్స్ వ‌స్తున్నాయి అని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో మస్క్ ఓ ప్ర‌ముఖ సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అయితే ట్విట‌ర్ ఇండిపెండెంట్ సంస్థ అని ఎలాంటి ప్ర‌భుత్వం నుంచి ఫండ్స్ రావ‌ట్లేద‌ని తెలిపారు. కాక‌పోతే 6 నెల‌ల నుంచి ఒత్తిడి ఎక్కువ‌గా ఉంద‌ని మ‌స్క్ అన్నారు. కానీ ట్విట‌ర్‌ని కొనుగోలు చేసి మంచి ప‌నే చేసాన‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల ట్విట‌ర్ పేరులో డ‌బ్ల్యూ ప‌దాన్ని తీసేయ‌డం, ట్విట‌ర్ ప‌క్షికి బ‌దులు కుక్క బొమ్మ‌ను పెట్ట‌డం వంటివి వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.