Rohit Sharma: రిటైర్మెంట్ విర‌మించుకోనున్న రోహిత్?

rohit sharma to take back his retirement plans

Rohit Sharma: టీ20 ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌గానే ఇక టీ20ల‌కు సెల‌వు అంటూ బాంబు పేల్చాడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. రోహిత్ త‌ర్వాత విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జడేజాలు కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించేసారు. అయితే రోహిత్ త‌న రిటైర్మంట్ ప్లాన్‌ను విరమించుకుంటున్నార‌నే టాక్ మొద‌లైంది. ఇందుకు కార‌ణం రోహిత్ ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన కామెంట్సే.

“” చూడ‌బోతే నేను టీ20ల నుంచి రిటైర్ అయినట్లుగా లేదు. టీ20ల నుంచి నాకు రెస్ట్ ఇచ్చిన‌ట్లుంది. 2025 ఆసియా క‌ప్, 2026 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు న‌న్ను పిలుస్తారేమో అనిపిస్తోంది “” అని తెలిపారు. దాంతో రోహిత్ మ‌రో టీ20 ఆడ‌తాడేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.