New FASTag Rules: అమ‌ల్లోకి వ‌చ్చిన కొత్త ఫాస్టాగ్ రూల్స్ ఏంటో తెలుసా?

all you need to know about the New FASTag Rules

New FASTag Rules: ఆగ‌స్ట్ 1 నుంచి NPCI ప్ర‌వేశపెట్టిన‌ కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

ఒక‌వేళ మీరు ఫాస్టాగ్ తీసుకుని 3 నుంచి 5 ఏళ్లు అవుతుంటే.. అక్టోబ‌ర్ 31 లోపు KYC స‌మాచారాన్ని అప్డేట్ చేసుకోండి.

ఫాస్టాగ్ తీసుకుని ఐదేళ్లు అయిపోతుంటే కొత్త‌ది తీసుకోవాలి.

మీ వాహ‌న రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్, చాసిస్ నెంబ‌ర్, మొబైల్ నెంబ‌ర్ ఫాస్టాగ్‌కు లింక్ అయ్యి ఉన్నాయో లేదో చూసుకోండి

కొత్త వాహ‌నం కొనుగోలు చేసిన‌ట్లైతే ఫాస్టాగ్‌పై రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌ను 90 రోజుల్లోపు అప్డేట్ చేసేయాలి.

ఫాస్టాగ్‌పై మీ వాహ‌నానికి సంబంధించిన ముందు వెనుక భాగాల ఫోటోలు క్లియ‌ర్‌గా ఉండాలి.

మీ ఫాస్టాగ్ వివ‌రాల‌ను చెక్ చేసుకోవాలంటే భార‌త‌దేశ నేష‌న‌ల్ వాహ‌న రిజిస్ట్రీ అయిన వాహ‌న్ ద్వారా చూసుకోవ‌చ్చు

అక్టోబ‌ర్ 31 నాటికి పైన చెప్పిన రూల్స్ ఫాలో చేయ‌క‌పోతే టోల్ ప్లాజాల వ‌ద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.