Nikhil Advani: బాలీవుడ్‌పై అల్లు అర్జున్ ఆ కామెంట్ చేసాడు

Nikhil Advani reveals allu arjun comment on bollywood heroes

Nikhil Advani:  బాలీవుడ్‌పై టాలీవుడ్ స్టార్ న‌టుడు అల్లు అర్జున్ ఓ కామెంట్ చేసాడని అన్నారు ద‌ర్శ‌కుడు నిఖిల్ అడ్వాణీ. తాను ఒక‌సారి అల్లు అర్జున్‌తో సినిమా తీయాల‌నుకున్నాన‌ని.. ఈ విష‌యం గురించి అర్జున్‌ని క‌లిసి మాట్లాడిన‌ప్పుడు ఆయ‌న బాలీవుడ్ గురించి ఒక మాట‌న్నార‌ని తెలిపారు. ద‌క్షిణాది సినిమాలన్నీ మైథాల‌జీలా ఉంటాయ‌ని చాలా మంది అనుకుంటార‌ని.. కానీ ద‌క్షిణాది సినిమాల్లో హీరోల‌ను చాలా బాగా చూపిస్తార‌ని తెలిపారు. స్వ‌చ్ఛ‌మైన భావోద్వేగాలు పండిస్తార‌ని అన్నారు.

తాను అల్లు అర్జున్‌ని ఓ సినిమా కోసం క‌లిసినప్పుడు బాలీవుడ్ ప‌రిశ్ర‌మ అస‌లు హీరోయిజాన్నే మ‌ర్చిపోయింద‌ని కామెంట్ చేసిన‌ట్లు నిఖిల్ వెల్ల‌డించారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స‌మ‌స్య ఏంటో తెలుసా? మీరు హీరోల్లా ఎలా ఉండాలో మ‌ర్చిపోయారు. మైథాల‌జీ కాదు. బాలీవుడ్‌లో హీరోయిజం అనేదే లేదు అని అల్లు అర్జున్ కామెంట్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. దాంతో తాను తీయాల‌నుకున్న సినిమా గురించి మాట్లాడ‌లేక‌పోయాన‌ని వెల్లడించారు.