Samantha: ఆ సినిమాలో న్యూడ్​లుక్​లో సామ్​?

Hyderabad: రొటీన్​కి భిన్నంగా విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్​ఫుల్​గా సాగుతున్న హీరోయిన్​ సమంత(Samantha). కథ నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదు. గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’(Family Man2) వెబ్ సిరీస్ లో విలన్ గా నటించి పాన్ ఇండియా(Pan India) లెవెల్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది సామ్​. ఇక, తాజాగా సమంత(Samantha) గురించిన మరో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న సిటాడెల్​(Citadel) సిరీస్​లో ఈ భామ న్యూడ్​లుక్​లో కనిపించనుందట.

రాజ్, డీకే రూపొందించిన హాలీవుడ్(Hollywood) సూపర్ హిట్ సిరీస్​ ‘సిటాడెల్’ ని ఇండియన్ వెర్షన్ తీస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ ధావన్ హీరో గా నటిస్తున్నారు. ఈమధ్యనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సిరీస్​లో సమంత చేస్తున్న పాత్రని ఒరిజినల్ వెర్షన్ లో బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) చేసింది. ఇందులో ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయింది. బెడ్ రూమ్ లో హీరోతో కలిసి న్యూడ్ లుక్ తో కనిపించిన షాట్ ని రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో గమనించవచ్చు.

ఇక, సమంత అలా న్యూడ్ లుక్ లో కనిపించబోతుందట. అయితే తాజాగా రానా నాయుడు సిరీస్​తో టాలీవుడ్​ ప్రేక్షకులను అంచనా వేసిన మేకర్స్​ ఈ విషయంలో భయపడుతున్నారట. అయితే సమంత మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. కథకి కీలకంగా వచ్చే సన్నివేశం కాబట్టి తనకి ఏమాత్రం ఇబ్బంది లేదని, తాను సిద్దమే అంటూ చెప్పిందట. మరి ఆమె ఇలాంటి సన్నివేశం లో కనిపిస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన శకుంతలం(Shaakunthalam) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది సామ్​.