ఆలయానికి వెళ్లి నిమిషం కూడా కూర్చోకుండా వెళ్లిపోతున్నారా?
Spiritual: ఆలయాలకు వెళ్లినప్పుడు ఒక్క నిమిషం పాటు అక్కడ కూర్చుని ఇంటికి వెళ్తుంటాం. కానీ కొందరు అలా కూర్చోకుండా వెళ్లిపోతుంటారు. ఇలా చేయడం మంచిదేనా? పెద్దవాళ్లు ఈ నియమాన్ని పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఆలయంలో పాజిటివిటీ నిండి ఉంటుంది. అందుకే దర్శనం అయ్యాక ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే.. పెద్దయ్యాక పిల్లల్ని నన్ను ఆ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లు ఈ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లు అని అడిగే పని ఉండదు. ఎందుకంటే ఆలయంలో దర్శనం తర్వాత అక్కడ కాసేపు కూర్చుని దర్శనం చేసుకున్నదంతా నెమరువేసుకోగలుగుతాం కాబట్టి. అంతేకానీ ఆలయంలో కూర్చోకుండా వెళ్లిపోతే దేవుడు మన మీద కోపడతాడు అని కాదు.