Spiritual: ఎవరైనా శాపనార్థాలు పెడితే ఫలిస్తాయా? అలాంటప్పుడు ఏం చేయాలి?
Spiritual: మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాచకులు, నపుంసకులు డబ్బులు అడుగుతూ ఉంటారు. కొందరు డబ్బులు కావాలని అడిగితే.. ఇంకొందరైతే ఏకంగా బలవంతం పెట్టి కదలనివ్వకుండా పట్టుకుంటూ ఉంటారు. వారిని విడిపించుకుని మనం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతే నాశనమైపోతావ్ అంటూ శాపనార్థాలు పెడుతుంటారు.
యాచకులనే కాదు కొందరు ఇంట్లో వాళ్లు కూడా ఇదే బాపతికి చెందినవారు ఉంటారు. అయితే వారి శాపనార్థాలు ఫలిస్తాయా? మనపై ఆ ప్రభావం ఉంటుందా? అనే భయాలు చాలా మందికి ఉంటాయి. ఇలాంటి శాపాలకు భయపడి పాపం డబ్బులు ఇచ్చేసేవారు కూడా ఉంటారు. అయితే.. అలాగ శాపాలు పెట్టేవారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకరి శాపం ఫలించాలంటే మనం వారికి ద్రోహం చేసైనా ఉండాలి.. లేదా అవతలి వ్యక్తి వాక్శుద్ధి, శక్తిమంతుడు అయ్యి ఉండాలి. అలా ఉంటే తప్ప ఆ డొల్ల శాపాలు మనకి పనిచేయవు.