YSRCP: జ‌గ‌న్ ప‌రువు తీసేసిన భార‌తి..!

ys bharathi wrote bland article on jagan mohan reddy

YSRCP: ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రువు తీసేసారు ఆయ‌న సతీమ‌ణి భార‌తి రెడ్డి. భార‌తి రెడ్డి న‌డుపుతున్న సాక్షి ప‌త్రిక‌లో తెలుగు దేశం పార్టీ, కూట‌మి ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన కీల‌క వార్త‌ల‌ను ప్ర‌చురించే ముందు భార‌తి రెడ్డి స‌మీక్షిస్తార‌ట‌. ఆ త‌ర్వాతే అది ప్ర‌చురించాలా వ‌ద్దా అనే నిర్ణ‌యం తీసుకుంటారు. అలాంటిది ఈరోజు సాక్షి పత్రిక‌లోని మెయిన్ పేజీలో తెలుగు దేశం పార్టీ కూట‌మి ప్ర‌భుత్వం వైఫల్యం అంటూ రాసిన వార్త‌లో చిన్న పొర‌పాటును చూసుకోలేక‌పోయారు.

ఇంత‌కీ పత్రిక‌లో ఏం రాసారంటే.. ఈ నెల 15 లోగా ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించ‌కుంటే ఆరోగ్య శ్రీ సేవ‌లు ఆపేస్తామ‌ని.. ప్ర‌భుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ అసోసియేష‌న్ లేఖ రాసింది. ఈ విష‌యాన్ని సాక్షి పత్రిక‌లో ప్ర‌చురిస్తూ.. కూట‌మి ప్ర‌భుత్వం రూ.1600 కోట్లు చెల్లించ‌కుండా బ‌కాయిల‌ను పెండింగ్‌లో ఉంచింద‌ని.. ప్ర‌జ‌ల ఆరోగ్యంతో కూట‌మి ప్ర‌భుత్వం చెల‌గాటం ఆడుతోంద‌ని రాసారు. ఇక్క‌డ ఆ వార్త రాసిన వారు మిస్స‌యిన లాజిక్ ఏంటంటే… కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటికి 50 రోజులు అవుతోంది. ఈ రెండు నెల‌ల్లో రూ.1600 కోట్ల ఖ‌ర్చు ఎలా అవుతుంది? అంటే ఆ ఖ‌ర్చు జ‌రిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పాల‌న‌లో. ఈ చిన్న లాజిక్ మిస్స‌య్యి.. జ‌గ‌న్ క‌ట్ట‌ని బిల్లుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్ట‌లేద‌ని రాసేసారు. దాంతో భార‌తి రెడ్డే జ‌గ‌న్ ప‌రువు తీసేసార‌ని.. వార్త రాసే ముందు స‌రిగ్గా చెక్ చేసుకోవ‌డం కూడా రాదా అని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.