Lifestyle: క్యాజువ‌ల్ సెక్స్‌కి అల‌వాటుప‌డుతున్నారా?

all you need to know about casual sex

Lifestyle: మీరు ఆల్రెడీ ఒక‌రితో రిలేష‌న్‌షిప్‌లో ఉండి మ‌రొక‌రికి ఎట్రాక్ట్ అవుతున్నారా? దీనినే క్యాజువ‌ల్ సెక్స్ అంటారు. అంటే వారి అందానికి మీరు ఆక‌ర్షితులు అవుతూ వారితో శారీర‌క సుఖాన్ని పొందాల‌నుకుంటారే త‌ప్ప రిలేష‌న్‌షిప్‌లో ఉండాల‌ని అనుకోరు. ఇది ఈరోజుల్లో స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మారిపోయింది. అందుకే రెండు మూడు వారాల‌కే బ్రేక‌ప్స్ అయిపోతున్నాయి. ఈ క్యాజువ‌ల్ సెక్స్ నుంచి సులువుగా బ‌య‌ట‌ప‌డే మార్గాన్ని వెల్ల‌డించారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ (భ‌గ‌వంత్ కేస‌రి విల‌న్).

ఒక‌వేళ మీరు ఆల్రెడీ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ప్ప‌టికీ ఇత‌రుల‌ను చూస్తుంటే ఆ కోరిక క‌లుగుతోందంటే.. ఒక‌వేళ వారు మీకు ప‌రిచ‌యం ఉంటే మీరు అందంగా ఉన్నార‌నో హ్యాండ్స‌మ్‌గా ఉన్నార‌నో ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారి ప‌ట్ల మీకు వ‌స్తున్న క్యాజువ‌ల్ సెక్స్ అనే ఆలోచ‌న మైండ్ నుంచి వెళ్లిపోతుంద‌ట‌. అలాకాకుండా మీ పార్ట్‌న‌ర్‌కు తెలీకుండా మ‌రొక‌రితో క్యాజువ‌ల్ సెక్స్ చేయ‌డం అనేది ఒక‌రి క్యారెక్ట‌ర్‌ని బ‌ట్టి ఉంటుంద‌ని.. అలాంటి వారికి తాను ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వాల‌ని అనుకోవ‌డంలేద‌ని రాంపాల్ అన్నారు. క్యాజువ‌ల్ సెక్స్ అనే టాపిక్‌ను మైండ్ నుంచి తీసేయ‌క‌పోతే అది ఒక వ్య‌స‌నంగా మారిపోతుంద‌ని.. ఇలాంటి ఆలోచ‌న‌లు త‌ప్పు అని రియ‌లైజ్ అయ్యి దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం ఒక్క‌టే మార్గం అని అన్నారు.