Kuppam: కుప్పంలో వైసీపీ కార్యాలయం మూసివేత..!
Kuppam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయిన కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మూసివేసినట్లు తెలుస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యాలయంలో ఏ ఒక్కరూ లేరట. కనీసం ఎలాంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించడంలేదట. దాంతో ఖాళీగా పడి ఉన్న కార్యాలయాన్ని మూసివేయాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి.. పార్టీ అభ్యర్ధి కేజేఆర్ భరత్ అసలు నియోజకవర్గంలో కనిపించడంలేదని టాక్.
పార్టీ సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పం విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడంతో పార్టీకి చెందిన 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 సర్పంచ్లు, 60 మంది ఎంపీటీసీలు ఈరోజు అమరావతికి బయలుదేరారు. వీరంతా తెలుగు దేశం పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్ కూడా త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరనున్నట్లు హింట్స్ ఇచ్చారు. ఈ విషయం గురించి చంద్రబాబు కేబినెట్లోని ఓ మంత్రికి ముందే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.