ఇత‌ర మ‌గాళ్ల‌తో భార్య ఎఫైర్.. నాకేం ప్రాబ్లం లేదంటున్న‌ భ‌ర్త‌

this man is allowing his wife to have a open relationship with others

Viral News: పెళ్లయ్యాక భార్య అయినా భ‌ర్త అయినా ఇత‌ర వ్య‌క్తుల‌తో ఎఫైర్లు పెట్టుకోవ‌డం అనేది క్ష‌మించ‌రాని నేరం. ఈ విష‌యం ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రికి తెలిసినా ఎంతటి స్థాయిలో గొడ‌వ‌లు అవుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అయితే జపాన్‌కి చెందిన ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను ఇత‌ర మగాళ్ల‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డాన్ని ప్రోత్సహిస్తున్న ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌దంగా మారింది. జ‌పాన్‌కు చెందిన సోయ్, సీరా అనే యువ‌తీ యువ‌కులు మూడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత సీరా పై చ‌దువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.

అక్క‌డ మ‌రో అబ్బాయిని ఇష్ట‌ప‌డింది. ఈ విష‌యాన్ని త‌న భ‌ర్త సోయ్‌కి చెప్తే అత‌ను కూడా ఏమీ అన‌లేదు. పైగా సీరా ఎంత మంది అబ్బాయిల‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నా త‌న‌కు ఏమీ ప్రాబ్లం లేద‌ని.. త‌న భార్య సంతోష‌మే త‌న సంతోష‌మ‌ని అంటున్నాడు. పైగా త‌న భార్య ప్రియుళ్ల‌తో క‌లిసి డిన్నర్‌, పార్టీలు ఇలా ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తున్నారు. దీనిని ఓపెన్ రిలేష‌న్‌షిప్ అంటారు.

అంటే ఒక‌రితో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నా కూడా వేరొక‌రిని ఇష్ట‌ప‌డ‌చ్చు.. వారితో శృంగారం కూడా చేయొచ్చ‌న్న‌మాట‌. ఆల్రెడీ ఇలాంటివే స‌మాజంలో ఎక్కువ‌వుతున్న నేప‌థ్యంలో సోయ్, సీరాలు క‌లిసి దీనిని ప్రోత్స‌హించ‌డం ప‌ట్ల వారిపై నెటిజ‌న్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివారిని జైల్లో పెట్టాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.