అన్నీ క‌నిపించేలా దుస్తులేసుకున్న మ‌హిళ‌.. అనుమ‌తించ‌ని రెస్టారెంట్

a restaurant did not allow a woman who was showing cleavage

Restaurant: ఓ మ‌హిళ అస‌భ్య‌క‌ర‌మైన దుస్తులు వేసుకుని రెస్టారెంట్‌కి వెళ్ల‌డంతో వారు ఆమెని అనుమ‌తించ‌లేదు. అమెరికాలోని లూసియానాకు చెందిన క్లెన‌హ‌న్ అనే మ‌హిళ స్థానిక హాస్పిట‌ల్‌లో న‌ర్స్‌గా ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆమె ఓ రెస్టారెంట్‌కి వెళ్లింది. అయితే రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డు ఆమెను లోప‌లికి అనుమ‌తించ‌లేదు. ఇందుకు కార‌ణం ఆమె వ‌క్షోజాలు క‌నిపించేలా అస‌భ్య‌క‌ర‌మైన దుస్తులు వేసుకోవ‌డ‌మే.

దాంతో క్లెన‌హ‌న్ సెక్యూరిటీ గార్డుతో పెద్ద గొడ‌వేసుకుంది. చివ‌రికి రెస్టారెంట్ ఓన‌ర్ కూడా వ‌చ్చి త‌న సెక్యూరిటీ గార్డు చేసింది 100% క‌రెక్ట్ అని.. మ‌రీ ద‌రిద్రంగా ఉండే దుస్తులు వేసుకుని వ‌స్తే ఇత‌ర క‌స్ట‌మ‌ర్లు అసౌక‌ర్యానికి గుర‌వుతార‌ని చెప్పింది. దాంతో క్లెన‌హ‌న్ తిట్టుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.  ఈ విష‌యాన్ని క్లెన‌హ‌న్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రెస్టారెంట్‌లో ప‌నిచేసే మ‌హిళా వెయిట‌ర్లు మాత్రం వెన‌క పిర్ర‌లు క‌నిపించేలా చిన్న మిడ్డీలు వేసుకోవ‌చ్చు కానీ త‌న దుస్తుల్లో మాత్రం లోపం ఉందా అని మండిపడింది. అయితే ఆమె పోస్ట్ ప‌ట్ల పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఆ రెస్టారెంట్ ఓన‌ర్ చేసింది క‌రెక్టే అని మంచి దుస్తులు వేసుకుని వెళ్తే ఎవ్వ‌రూ ఏమీ అన‌ర‌ని చీవాట్లు పెడుతున్నారు.