Hackers: హైదరాబాద్ హాస్పిటల్స్‌పై సూడాన్ హ్యాకర్ల కన్ను
Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లోని ప్రముఖ హాస్పిటల్స్‌పై(hospitals) హ్యాకర్ల కన్నుపడింది. సూడాన్‌కు(sudan) చెందిన ఆనోనిమస్ సూడాన్(anonymous sudan) అనే ప్రో ఇస్లామిక్ హ్యాకర్ల సంస్థ(hackers) ఒకటి ఈసారి హైదరాబాద్ (hyderabad) హాస్పిటళ్ల సర్వర్లను టార్గెట్ చేసిందని అమెరికాకు(america) చెందిన రాడ్‌వేర్(radware) అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.. గతంలో ఈ సూడాన్(sudan) హ్యాకర్ల సంస్థ భారత నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టుల సర్వర్లను హ్యాక్ చేసింది. మార్చిలో ఈ సూడాన్ గ్రూప్ ఫ్రాన్స్ హ్యాస్పిటల్ సిస్టమ్‌లపై డీడాస్ (డిస్ట్రిబ్యూటెడ్ డినైయల్ ఆఫ్ సర్వీస్) ఎటాక్స్ చేసారు. అయితే ఇది హ్యాకింగ్ కాదని యాక్సిస్ లేనివారు కూడా వివిధ ప్రదేశాల నుంచి హాస్పిటల్ వెబ్సైట్ సిస్టమ్స్‌ని ఆపరేట్ చేస్తుండడంతో సర్వర్లు డౌన్ అయిపోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల అవసరం ఉన్నవారికి హాస్పిటల్ వెబ్సైట్లు ఓపెన్ అవడంలేదని అంటున్నారు.
ముఖ్యంగా హెల్త్‌కేర్ సంస్థలపై ఇలాంటి హ్యాకింగ్‌లకు పాల్పడితే ఊహించలేని రీతిలో నష్టం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని సందర్భాల్లో సిస్టమ్‌లో ఉండే పేషెంట్ డేటా డిలీట్ చేసేస్తే వారి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుందని అంటున్నారు. ఎందుకంటే హాస్పిటల్‌కు వచ్చే ప్రతి పేషెంట్ రోగానికి సంబంధించిన డేటాను సిస్టమ్‌లో భద్రపరుస్తారు. ఒకవేళ పేషెంట్ డేటా పోతే అతనికి ట్రీట్మెంట్ ఏ స్టేజ్‌లో ఉంది, రోగం ఏ స్టేజ్‌లో ఉందో కనుక్కోలేం. ఎలాంటి రిస్కులకు తావు లేకుండా అన్ని సంస్థలు ఒక్కటై ఈ హ్యాకింగ్‌లకు ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నారు.