అతని టార్గెట్ భర్త లేని స్త్రీలు.. 20 మంది మహిళల్ని వివాహమాడి..
Viral News: అతని టార్గెట్ కేవలం భర్త చనిపోయిన స్త్రీలు.. విడాకులు తీసుకున్న మహిళలు. అలా మ్యాట్రిమోనియల్ సైట్ సాయంతో దాదాపు 20 మంది మహిళలను పెళ్లి చేసుకుని వారి నుంచి విలువైన వస్తువులను కాజేసిన నిత్య పెళ్లికొడుకు కథ ఇది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల ఫిరోజ్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో తన ఫోటోలు పెట్టి ఇంకా పెళ్లి కాలేదని.. కట్నం కూడా అవసరం లేదని కలరింగ్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు 20 మంది ఆడవాళ్లను పెళ్లి చేసుకుని వారి నుంచి డబ్బు, నగలు, విలువైన సామాన్లు తీసుకుని పరారయ్యాడు.
నాల్ సోపారా ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆమె నుంచి డబ్బు, ల్యాప్‌టాప్ తీసుకుని పారిపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసు గురించి పోలీసులు ఆరా తీస్తుండగా నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బయటపడింది. అలా ఫిరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతని నుంచి భారీగా నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ల్యాప్‌టాప్స్, ఫోన్లు లభ్యమయ్యాయి.