యువతి మూడో పెళ్లి యోచన.. చంపేసిన సోదరులు
Viral News: ఓ యువతి మూడో పెళ్లికి సిద్ధం అవుతోందని తెలిసి ఆమె సోదరులు దారుణంగా చంపేసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. కరాచీలోని బహదూర్బాద్కి చెందిన హసీన్ అనే యువతికి ఆల్రెడీ రెండు సార్లు పెళ్లైంది. కానీ దురదృష్టవశాత్తు వారిద్దరూ వేరు వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దాంతో ఆమె మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఇందుకు హసీన్ ఇద్దరు సోదరులు ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే హసీన్‌కు మొదటి ఇద్దరు భర్తల ద్వారా ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చూసుకుంటే సరిపోతుందని మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమెను మందలించారు. ఇందుకు హసీన్ ఒప్పుకోలేదు. 8 మంది పిల్లలను తాను ఒక్కదాన్నే పోషించలేనని తనకు పెళ్లి చేయాల్సిందేనని పట్టుబట్టింది.
దాంతో ఆ ఇద్దరు సోదరులు ఆమెను పిస్టల్‌తో కాల్చి చంపేసారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే హసీన్ చనిపోయింది. ఆమె మృతదేహం వద్ద 30 బోర్ పిస్టళ్లు లభించాయి. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.