Jagan Mohan Reddy: ఎన్టీఆర్‌ను దించ‌డంలోనూ.. BJPని త‌న్న‌డంలోనూ అదే ప్ర‌చారం

jagan mohan reddy says chandrababu naidu using same technique to avoid manifesto

Jagan Mohan Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేసిన ఆర్థిక నేరాల‌ను శ్వేత‌ప‌త్రం ద్వారా రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎదురుదాడికి దిగారు. హామీల‌ను ఎగ్గొట్టేందుకు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జ‌రిగింది అంటూ అదే తంతును చంద్ర‌బాబు ఫాలో అవుతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌ను దించడంలోనూ.. BJPని ఒప్పించడంలోనూ.. అదే BJPని తన్నడంలోనూ.. హామీలను ఎగ్గొట్టడంలోనూ చంద్రబాబు అవే ప్రచారాలు చేస్తున్నార‌ని ఆరోపించారు.

చంద్ర‌బాబు నాయుడు గ‌త ప్రభుత్వంలో చేసిన అప్పు 24% వ‌ర‌కు ఉంటే.. త‌న హ‌యాంలో కేవ‌లం 12% మాత్ర‌మే చేసామ‌ని.. కానీ చంద్ర‌బాబు ఏకంగా గ‌వ‌ర్న‌ర్‌తోనూ అవే అబ‌ద్ధాలు ప్రచారం చేయించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు.