శ్రీలంక సిరీస్‌కి ముందు గంభీర్‌కి షాక్‌

Mohammed Siraj injured ahead of srilanka series

Mohammed Siraj: శ్రీలంక సిరీస్‌కి ముందు టీమిండియా కోచ్ గౌత‌మ్ గంభీర్‌కి, కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కి షాక్ త‌గిలింది. ఈ సిరీస్‌కి ముగ్గురు బెస్ట్ బౌల‌ర్ల‌ను గంభీర్ ఎంపిక‌చేసారు. వారిలో అర్ష్‌దీప్ సింగ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ఖ‌లీల్ అహ్మ‌ద్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో సిరాజ్ లేడు. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సిరాజ్ కాలికి బంతి త‌గ‌లడంతో గాయ‌మైంద‌ట‌. దాంతో సిరాజ్ లంక సిరీస్ ఆడే అవ‌కాశాలు త‌క్కువ‌నే చెప్పాలి. ఒక‌వేళ సిరాజ్ కోలుకుంటే ఫ‌ర్వాలేదు. లేక‌పోతే సిరాజ్ స్థానంలో ఆవేశ్ ఖాన్ కానీ ముఖేష్ కుమార్ కానీ ఆడే అవ‌కాశం ఉంది. లంక సిరీస్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని గంభీర్ ఎంతో ప‌ట్టుద‌ల‌తో త‌న టీంను సిద్ధం చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌ను సెలెక్ట్ చేసిన బౌల‌ర్ల‌లో ఒక‌రికి గాయం కావ‌డంతో గంభీర్ బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.