Madras High Court: వ్యభిచార కొంప నడుపుకుంటా.. కోర్టులో అడ్వకేట్ షాకింగ్ పిటిషన్
Madras High Court: మద్రాస్ హైకోర్టు జడ్జిలకు షాకింగ్ ఘటన ఎదురైంది. అదే హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్న మురుగన్ అనే వ్యక్తి కోర్టులో ఓ పిటిషన్ వేసాడు. తాను తమిళనాడులోని ఓ ప్రాంతంలో వ్యభిచార కొంపను నడుపుతున్నానని.. కానీ దానిని తీసేయాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నందున అందులో ఏ తప్పూ లేదని తీర్పు ఇవ్వాలంటూ పిటిషన్ వేసుకున్నాడు. ఆ పిటిషన్ చూసిన జడ్జి షాకయ్యాడు. అడ్వకేట్ మురుగన్‌పై మండిపడ్డాడు.
“” ఆల్రెడీ సమాజంలో న్యాయవాదుల పట్ల ఉన్న గౌరవం తగ్గిపోతోంది. ఇక నుంచి మంచి పేరున్న లా కాలేజ్‌లలో చదివి పాసైన వారినే లాయర్లు, అడ్వకేట్లుగా నియమించాలని బార్ కౌన్సిల్‌ను కోరుతున్నాను. లేకపోతే ఇలాంటి దరిద్రపుగొట్టు పిటిషన్లపై టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది “” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ పిటిషన్‌ను కొట్టేసారు. అంతేకాదు.. ఇలాంటి పిటిషన్ వేసినందుకు రూ.10 వేలు జరిమానా కూడా విధించారు.