Spiritual: ఒక‌రి బ‌దులు ఇంకొక‌రు పారాయ‌ణం చేయ‌చ్చా?

can one do parayana on behalf of other

Spiritual: పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రావ‌డంలేదనో.. కొడుకు లేదా కూతురి కాపురం స‌రిగ్గా లేద‌నో వారి కోసం పారాయ‌ణాలు చేస్తుంటారు. ఒక‌రు చేసిన క‌ర్మ‌ల‌కు వారే బాధ్య‌త వ‌హించాలి అన్న‌ట్లు.. ఎవ‌రికి ఏ స‌మ‌స్య ఉన్నా వారే స్వ‌యంగా పారాయ‌ణం చేసుకోవాలే త‌ప్ప ఒక‌రి కోసం వేరొక‌రు పారాయ‌ణం చేస్తే ఫ‌లితం ఉండ‌దు. మీకు ఆక‌లేస్తే మీ ప‌క్క‌వాడు అన్నం తింటే కడుపు నిండుతుందా? ఇది కూడా అంతే. కాక‌పోతే చిన్న‌పిల్ల‌లు, చ‌ద‌వలేని స్థితిలో ఉన్నవారి కోసం పారాయ‌ణం చేయ‌చ్చా? అంటే చేయ‌చ్చు. ఇందుకోసం వారు మీ ప‌క్క‌నే ఉండాల‌న్న విష‌యం గుర్తుంచుకోండి.