Lifestyle: నా ఎక్స్ శృంగారం చేయాలంటూ బెదిరిస్తున్నాడు
Lifestyle: నేను కాలేజీ రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించాను. రెండేళ్లు లవ్‌లో ఉన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు పెళ్లై మూడేళ్లు అవుతోంది. ఇంతకాలం తర్వాత నా ఎక్స్ మళ్లీ నా జీవితంలోకి ప్రవేశించాడు. తనతో శృంగారం చేయాలని లేకపోతే పాత ఫోటోలను నా భర్తకు చూపిస్తానని బెదిరిస్తున్నాడు. మా వారికి ఈ విషయం తెలీదు. తెలిస్తే ఏమవుతుందో అని భయమేసి నేను చెప్పలేదు. ఏం చేయంటారు?
నిపుణుల సలహా
ముందు మీరు వెంటనే ఈ విషయాన్ని మీ భర్తకు ఉన్నది ఉన్నట్లు చెప్పేయండి. మీ మాజీ ప్రియుడు బెదిరింపులకు మీరు లొంగకుండా ధైర్యంగా మీ భర్తకు ఈ విషయం చెప్పినందుకు ఆయన సంతోషిస్తారు. వీలైతే మీ భర్తే మీ మాజీకి బుద్ధి చెప్పే చర్యలు తీసుకుంటారు. మీరు చెప్పకుండా మీ మాజీ చెప్పినట్లు చేస్తే మాత్రం నాశనం అయ్యేది రెండు జీవితాలు. అంతదాకా తెచ్చుకోకండి. ముందు జరిగినది మీ భర్తకు తెలియజేయండి.