Spiritual: ఇంట్లో ఒకరికి రజస్వల అయితే మిగతావారు పూజ చేయచ్చా?
Spiritual: ఇంట్లో ఆడవాళ్లకు రజస్వల అవుతున్నప్పుడు మిగతావారు పూజ చేయచ్చా? అనే సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది. ఒకప్పుడు స్త్రీలు రజస్వల సమయంలో ఒక గదిలో మూలకు చాప వేసుకుని ఐదు రోజుల పాటు అక్కడే తినడం, నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఇలా పాటించేవారు చాలా అరుదనే చెప్పాలి. ఒకవేళ ఇలా పాటించలేని వారు ఆ ఐదు రోజుల పాటు పూజ చేయకపోవడమే మంచిది. ఒకవేళ సంధ్యావదనం వంటివి చేసుకోవాలనుకుంటే.. రజస్వలతో ఉన్న స్త్రీ నిద్ర లేవడానికి ముందే ఒక శుభ్రమైన ప్రదేశంలో తడిబట్టతో తుడుచుకుని సంధ్యావదనం చేసుకుంటే సరిపోతుంది.