KTR: అసెంబ్లీలో రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

KTR satire on revanth reddy in telangana assembly

KTR:  తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్లు వేసారు. ముఖ్య‌మంత్రికి ఓర్పు అనేది ఉండాల‌ని మాటిమాటికీ అయ్య‌ల‌ను చూసుకుని వ‌చ్చారు అని కామెంట్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు.

“” అధ్య‌క్షా.. ముఖ్య‌మంత్రికి ఓపిక అనేది ఉండాలి. అంతేకానీ ఇలా ర‌న్నింగ్ కామెంట‌రీ చేస్తే కుద‌ర‌దు. ఇప్పుడు నేను కూడా పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నేను కూడా అనొచ్చు. రేవంత్ రెడ్డి అయ్యల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారు అని అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీని అంటున్నడా? రాజీవ్ గాంధీని అంటున్నడా? నాకైతే అర్థ‌మైత‌లేదు “” అని సెటైర్లు వేసారు. దాంతో వెన‌కే ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి నేత‌లు బ‌ల్ల గుద్దుతూ కేక‌లు వేసారు.