Chat GPT.. Bing.. Bard.. వీటిలో ఏది బెస్ట్?
Hyderabad: ఆర్టిఫిషియల్ ఇన్‌టెలిజెన్స్(Artificial intelligence) రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకొక ఏఐ(AI) టూల్‌తో టెక్నాలజీ దూసుకెళ్తోంది. ఐటీ(IT) ఉద్యోగులకు ఇది ఓ పక్క టెన్షన్ కలిగిస్తూనే మరోపక్క వర్క్ సులువుగా చేసిపెడుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న చాట్‌బాట్స్‌లో చాట్ జీపీటీ(chat gpt), మైక్రోసాఫ్ట్ బింగ్(microsoft bing), గూగుల్ బార్డ్(google bard) ఉన్నాయి. ప్రపంచాన్ని శాసిస్తున్న రెండు టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్(microsoft), గూగుల్(google). చాట్ జీపీటీ, బింగ్ రెండూ మైక్రోసాఫ్ట్‌వే. తర్వాత చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను తీసుకొచ్చింది గూగుల్. అయితే బింగ్, బార్డ్ కంటే ఎక్కువగా చాట్ జీపీటీకి పాపులారిటీ ఉంది. మరి ఈ మూడిట్లో బెస్ట్ ఏదో చూద్దాం.
అసలు ఈ చాట్‌బాట్స్ చేసే పని ఏంటంటే.. గూగుల్ లేదా ఏ సెర్చ్ ఇంజిన్‌లోనైనా మీకు కావాల్సింది సెర్చ్ చేస్తే వందల్లో రిజల్ట్స్ చూపిస్తుంది. కానీ ఈ చాట్‌బాట్స్‌లో మీరు అడిగినదానికి మాత్రమే సమాధానం చెబుతుంది. 5 పదాల్లో ఫలానా అంశం గురించి సమాచారం కావాలి అని అడిగితే.. 5 పదాల్లోనే ఇవ్వగలగాలి. అంతకుమించి ఎక్కువ లేదా తక్కువ ఇచ్చినా ఈ చాట్‌బాట్స్‌కు అంత సామర్ధ్యం లేనట్లే. అలా ఈ మూడు చాట్‌బాట్స్ కొన్ని సార్లు అడిగినన్ని పదాల్లో సమాచారం ఇస్తున్నాయి. కొన్ని సార్లు విఫలమవుతున్నాయి. అలా చూసుకున్నట్లైతే.. చాట్ జీపీటీనే విన్నర్‌గా గెలిచింది. ఇక గూగుల్‌కి చెందిన బార్డ్ నుంచి అసలు ఎలాంటి సంతృప్తికరమైన అంశాలు లేవు.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. అన్ని చాట్‌బాట్లు పవర్‌ఫుల్‌గానే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా వాడుతున్నామన్నదే ప్రశ్న. ఇప్పటికే కొందరు హ్యాకర్లు ఈ చాట్‌బాట్ల సాయంతో మాల్వేర్‌ను రూపొందించేస్తున్నారట. కాబట్టి ఈ చాట్‌బాట్ల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.