ఆత్మహత్య చేసుకోవాలనుకున్న షమీ.. స్నేహితుడి షాకింగ్ వ్యాఖ్యలు
Mohammed Shami: మంచి వికెట్ కీపర్ అయిన మహ్మద్ షమీ.. ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన ఉమేష్ కుమార్ వెల్లడించారు. 2018లో షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. ఆయన మాజీ భార్య హసీన్ జహాన్. ఆ సమయంలో షమీపై తీవ్ర నెగిటివిటీ ఉండటంతో అతను తన అపార్ట్‌మెంట్‌లోనే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. ఆ సమయంలో షమీతో పాటు ఉమేష్ కూడా ఉన్నాడు. షమీ బాల్కనీలో నిలబడి వింతగా ప్రవర్తించడం చూసి తనకు భయమేసిందని.. తాను అక్కడ లేకపోయి ఉంటే షమీ ఏం చేసుకునేవాడో తలుచుకుంటేనే భయంగా ఉందని తెలిపాడు.
2023 ప్రపంచ కప్ సమయంలో 24 వికెట్లు తీసిన షమీ ప్రస్తుతం మ్యాచ్ సమయంలో తగిలిన గాయాల నుంచి కోలుకుంటున్నాడు. సెప్టెంబర్‌లో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్‌లో షమీ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా షమీ ఆడనున్నాడు.