Indraja: జబర్దస్త్‌లో అడల్ట్ కామెడీపై ఇంద్రజ స్పందన
Indraja: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన జబర్దస్త్ కామెడీ షో ఒకప్పటిలా లేదని.. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ బాడీ షేమింగ్ ఎక్కువైపోయిందని చాలా కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై జబర్దస్త్ జడ్జిగా చేస్తున్న ఇంద్రజ స్పందించారు.
“” జబర్దస్త్ షో అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తూ బాగా పాపులర్ అయిన ఒక మంచి షో. ఇది నిజంగా చాలా గర్వకారణం. ఇప్పటివరకు ఏ షోకి రానంత ఆదరణ జబర్దస్త్‌తో వచ్చింది. మున్ముందు ఇంకా ఫ్రెష్‌గా మరిన్ని మార్పులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక బాడీ షేమింగ్, అడల్ట్ కామెడీకి విషయాలకు వస్తే.. అక్కడ కామెడీ చేసేది కూడా అడల్ట్సే. అంతేకానీ పిల్లలు ఎవ్వరూ లేరు. ఒక స్కిట్‌ని ఓకే చేసే ముందు పరిమితి దాటిన డబుల్ మీనింగ్ కామెడీ ఉందా లేదా అని డిపార్ట్మెంట్ చెక్ చేసి మరీ ప్రసారం చేస్తుంది.
ఇక బాడీ షేమింగ్ అంటారా.. స్కిట్ చేస్తున్నవాళ్లే మాపై ఇంకా పంచ్‌లు వేయండి అని నన్ను అడుగుతుంటారు. అన్నా నాపై ఇంకొన్ని పంచ్‌లు వేయన్నా.. దరిద్రంగా ఉన్నా ఫర్వాలేదు నాకు పాపులారిటీ వస్తుంది అని అడిగి మరీ పంచ్‌లు వేయించుకుంటారు. ఇక్కడ ఎవ్వరూ ఇష్టం లేకుండా పెర్ఫామ్ చేయడం లేదు. అందరికీ నచ్చే ఈ షోలో చేస్తున్నారు. ఇక నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసేవారు అసలు జబర్దస్త్ చూసి కామెంట్స్ చేస్తున్నారని నేను అనుకోను. ఎందుకంటే వారు చూస్తే ఇలాంటి కామెంట్స్ చేయరు “” అని తెలిపారు.