ఇంట్లో పాడైపోయిన దేవుడి ఫోటోలు ఉన్నాయా? అయితే ఇలా చేయండి
Spiritual: ఇంట్లో పాడైపోయిన ఫోటోలు, విగ్రహాలు ఉంటే చాలా మంది ఏదన్నా చెట్టు కింద పెట్టేయడమో.. లేక ఎవ్వరికీ కనపడకుండా గుళ్లకు తీసుకెళ్లి అక్కడ పెట్టేయడం వంటివి చేస్తుంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకండి. ఎన్నో రోజులుగా పూజలు అందుకున్న ఆ ఫోటోలు, విగ్రహాలను అలా దిక్కులేని విధంగా వదిలేస్తే లేని పోని సమస్యలు వస్తాయి.
ఇలాంటప్పుడు వాటిని ఏం చేయాలంటే.. ఫోటో ఫ్రేంని, అద్దాన్ని తీసేసి లోపల ఉన్న ఫోటోను ఏదన్నా నదిలోనో లేక నీటిలోనో దండం పెట్టుకుని వదిలేయండి. ఆ ఫోటో ఫ్రేంని, అద్దాన్ని మాత్రం మీరు చెత్తలో పడేసినా ఏం కాదు. కానీ దేవుడి పటాలను మాత్రం ఇష్టమొచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ పడేయకండి. విగ్రహాలను కూడా కుదిరితే నదిలో పడేసేందుకు ప్రయత్నించండి.