Lifestyle: ముద్దుకి ఓకే.. సెక్స్‌కి మాత్రం నో అంటున్నాడు

my husband is asexual what to do

Lifestyle: మాది ప్రేమ వివాహం. మూడేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పెళ్లై మూడు నెల‌లు అవుతోంది. ఈ మూడు నెల‌ల్లో ముద్దు, కౌగిలింత‌లు త‌ప్ప క‌ల‌యిక అనేదే లేదు. ఆయ‌న సెక్స్ గురించి మాట్లాడితే న‌చ్చ‌న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. మేం డేటింగ్‌లో ఉన్న‌ప్పుడు కూడా అంతే. పెళ్లి త‌ర్వాత సెక్స్ చేయాల‌నుకుంటున్నాడేమో ఎంత మంచివాడో అనుకున్నాను. కానీ పెళ్లి త‌ర్వాత కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఆయ‌న‌లో ఏమ‌న్నా లోపం ఉందంటారా?

నిపుణుల స‌ల‌హా

మీ భ‌ర్త ఏసెక్సువ‌ల్ అని తెలుస్తోంది. అంటే వారు ముద్దు, కౌగిలింత‌లు ఎంజాయ్ చేస్తారు కానీ సెక్స్ ఎంజాయ్ చేయ‌లేరు. మీ భ‌ర్త అవ‌స‌రాలేంటో తెలుసుకోండి. ఆయ‌న మీతో క‌ల‌వ‌డం లేద‌ని చిరాకు ప‌డ‌టం తిట్ట‌డం వంటివి చేయ‌ద్దు. ఆయ‌న‌లో ఏ లోపం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నారు. ఈ సెక్స్ విష‌యంలో ఆయ‌న‌పై ద్వేషం వంటివి పెంచుకోవ‌ద్దు. సెక్స్ కౌన్సిల‌ర్ల వ‌ద్ద‌కు తీసుకెళ్తే ఏద‌న్నా మార్పు రావ‌చ్చు. ఆర్గాజం రావాలంటే సెక్స్ ఒక్క‌టే మార్గం కాదు. ఈ అంశాల‌ను మీ భ‌ర్త‌తో ఓపెన్‌గానే డిస్క‌స్ చేయండి. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంది.