AP Assembly: లైవ్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌కి జ‌గ‌న్ బెదిరింపు

jagan mohan reddy fires at a police officer at ap assembly

AP Assembly: మీడియా చూస్తుండ‌గానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ అధికారికి వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆయ‌న ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేస్తుండ‌గా. మ‌ధుసూద‌న్ అనే పోలీస్ అధికారి ఆ ప్లకార్డుల‌ను నేత‌ల చేతుల్లో నుంచి లాక్కుని మ‌రీ చించేసారు. దాంతో జ‌గ‌న్ వారిపై ఫైర్ అయ్యారు.

ప్లకార్డుల‌తో అసెంబ్లీ లోప‌లికి వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకోగా జ‌గ‌న్ మ‌ధుసూద‌న్‌ను లైవ్‌లో బెదిరించారు. మీకు మా నుంచి ప్ల‌కార్డులు లాక్కుని మరీ చించే అధికారం ఎవ‌రిచ్చారు? ఇది ప్ర‌జాస్వామ్యం కాదా? గుర్తుపెట్టుకో మ‌ధుసూదన్.. అధికారం ఎప్పుడూ ఒక్క‌రిదే కాదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు అంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దాంతో అసెంబ్లీ బ‌య‌ట ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.