Nayanthara: అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డ్ వద్దు..!
Nayanthara: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేత అవార్డు తీసుకోవాలని ప్రతి నటీనటులు కోరుకుంటారు. ఎందుకంటే ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌డం అలాంటిది. అయితే ఒకానొక సందర్భంలో లేడీ సూపర్‌స్టార్ అయిన నయనతార.. అల్లు అర్జున్ నుంచి తాను అవార్డు తీసుకోనని తేల్చి చెప్పేసింది. 2016లో విజయ్ సేతుపతి, నయనతార నటించిన నేనూ రౌడీనే సినిమాకు గానూ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అయితే ఆ అవార్డును అల్లు అర్జున్ ప్రదానం చేయనున్నారని తెలిసి.. తాను తీసుకోనని చెప్పేసింది. తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన మూవీ కాబట్టి తన భర్త చేతుల మీదుగానే తీసుకుంటానని చెప్పింది.
అయితే ఇప్పుడు ఈ అంశం గురించి ఎందుకు వివరించాల్సి వస్తోందంటే.. వారం రోజుల క్రితం ఇలాంటి ఘటనే పునరావృత్తం అయ్యింది. మనోరతంగళ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సమయంలో ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రమేష్ నారాయణ్‌కు అవార్డు ఇవ్వాలని అనుకున్నారు. ఆ అవార్డును నటుడు ఆసిఫ్ అలీ చేత ఇప్పించాలని అనుకున్నారు. అది రమేష్ నారాయణ్‌కు నచ్చలేదు. స్టేజ్‌పైనే ఆయన ఆసీఫ్ అలీ నుంచి అవార్డును నిరాకరించడం షాక్‌కు గురిచేసింది. పైకి నవ్వుతూ కనిపించాన ఆసిఫ్ అలీ ఎంతో బాధపడ్డారు. దాంతో సంతోష్ నారాయణ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.