పాండ్యను కెప్టెన్ చేయొద్దన్న రోహిత్.. బయటికొచ్చిన షాకింగ్ రిపోర్ట్
Hardik Pandya: ఈ ఏడాది హార్దిక్ పాండ్యకు అన్నీ ఇబ్బందికర పరిస్థితులనే చెప్పాలి. ఐపీఎల్‌లో విఫలం అవడం.. భార్య నుంచి విడిపోవడం.. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తన సత్తా చాటినా.. ఇప్పుడు శ్రీలంక సిరీస్‌కు కెప్టెన్సీ దక్కకపోవడం పాండ్యను కుంగదీస్తున్న అంశాలు.కొత్తగా ఎంపికైన టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చలు జరిపి సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంక సిరీస్‌కు కెప్టెన్ చేయాలని నిర్ణయించాడు. ఇది పాండ్యకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది.
అయితే పాండ్యను శ్రీలంక సిరీస్‌కి కెప్టెన్‌ని చేయకపోవడంపై ఒక షాకింగ్ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే.. గంభీర్, అగార్కర్ తమ నిర్ణయాన్ని పాండ్యకు తెలియజేయక ముందే వారిద్దరూ రోహిత్ శర్మతో సమావేశం అయ్యారట. అప్పుడు రోహిత్ అన్ని విధాలుగా ఆలోచించి చర్చలు జరిపి పాండ్యను కెప్టెన్‌ను చేయొద్దని చెప్పాడట. అంతేకాదు.. గంభీర్‌ని టీమిండియా కెప్టెన్‌ని చేయాలని మేనేజ్‌మెంట్‌కు విన్నవించింది కూడా రోహితే అని టాక్ వినిపిస్తోంది. రోహిత్, గంభీర్‌కి మంచి స్నేహం ఉన్నందున రోహిత్ చెప్పిన విషయాన్ని గంభీర్ పరిగణనలోకి తీసుకుని పాండ్యను కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.